ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తీ 'ఖైదీ' సినిమాకి 'యూ/ఏ' సర్టిఫికెట్...

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2019, 04:29 PM

హీరో కార్తీ నటించిన తాజా చిత్రం ఖైదీ. ఓ విభిన్నమైన కథతో వైవిధ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, మరియు తమిళ భాషలలో విడుదల కానుంది. కాగా సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. 'యూ/ఏ' సర్టిఫై తో రెండు గంటల ఇరవై నిముషాల డ్యూరేషన్ తో ఖైదీ ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతున్నాడు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకం పై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ను తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్ స‌మ‌ర్పిస్తున్నారు. కాగా ఖైదీ టీజర్ ట్రైలర్ తోనే అంచనాలను పెంచేసింది. ఇక అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ లేదు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ డిఫరెంట్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa