పూజా హెగ్డే.. వరుణ్ తేజ్ 'ముకుంద' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన విషయం తెలిసిందే. డిజె’ సినిమా తో హాట్ బ్యూటీ పూజ హెగ్డే రేంజ్ బాగా పెరిగిపోయింది. ఈ సినిమాలో తన అందాన్ని ఆరబోసిన ఈమె వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేయడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఆమె 'అరవింద సమేత'తో హిట్ కొట్టింది. అంతేకాదు.. మహేష్ హీరోగా ఇటీవల వచ్చిన 'మహర్షి'లో కూడా అదరగొట్టింది. కాగా మరోసారి వరుణ్‌తో 'గద్దలకొండ గణేష్'లో ఆడిపాడింది. ఈ సినిమాలో శ్రీదేవిగా మల్లేపూలు పెట్టి.. లంగా ఓణీలో తెలుగు అమ్మాయిగా అదరగొట్టంది. కాగా ఆమె మరో సినిమా 'అల వైకుంఠపురములో' నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలకు రెడీ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa