కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. షో ఇంకొద్ది రోజుల్లో ముగియనుండడంతో కొట్లాటలు.. తిట్టులతో.. ముందుకు దూసుకెళ్తోంది. షో విషయానికి వస్తే.. రాహుల్ టికెట్ టు ఫినాలేను దక్కించుకొని ప్రశాంతంగా ఉన్నాడు. కాగా.. బిగ్ బాస్ హౌజ్‌లో టాప్ ఫైవ్‌లో ఉండటానికి.. మిగతా కంటెస్టెంట్స్ పడుతున్న కష్టాలను చూస్తూ.. ఎంజాయ్ చేస్తున్నాడు. మిగితా సభ్యులు టాప్ ఫైవ్‌లో ఉండాలని.. ఫైనల్ కి అర్హత సాధించాలని శక్తిమేర ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు షో చివరి దశకు చేరుకోవడంతో బిగ్ బాస్ కూడా కఠినమైన టాస్కులతో అదరగొడుతున్నాడు. అందులో భాగంగా.. శ్రీముఖిని చేప నోట్లో ఉన్న మౌత్ ఆర్గాన్ ప్లే చేయాలని చెప్పిన బిగ్ బాస్, శివజ్యోతిని గుడ్డు కలిపిన చిక్కని పాలను తాగాలని ఆదేశించాడు. అలీ,బాబా భాస్కర్, వరుణ్ లకు మరికొంత కష్టమైన ఫిజికల్ టాస్క్‌లు ఇచ్చి చుక్కలు చూపించాడు. కాగా హౌస్ లో ఉన్న ఆరుగురు సభ్యులలో ఐదుగురు మాత్రమే ఫైనల్ కి వెళతారు. ఒకరు ఎలిమినేట్ అవడం జరుగుతుంది. ఎటూ రాహుల్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. కావున మిగిలిన ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. కాగా ఈరోజు విడుదలైన బిగ్ బాస్ ప్రోమో ప్రకారం... ఒక్క రాహుల్‌ను తప్ప అందర్నీ బ్యాగులు సర్దుకోమని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న ఇంటి సభ్యులు నోరెళ్ల పెడుతూ.. బ్యాగులు సర్దేస్తున్నారు. మరోవైపు ఈ ప్రోమో చూసిన నెటిజన్స్.. అసలు బిగ్ బాస్ హౌజ్‌లో ఈరోజు ఏం జరుగుతుందని తెగ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.
All housemates Pack your bags!!!#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/MphP1KDfm9
— STAR MAA (@StarMaa) October 25, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa