ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేక్షకులకు మా పాత్రలు బాగా కనెక్ట్ అవుతాయి

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 31, 2019, 07:20 PM

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది నటి విజయశాంతి. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు.. రష్మిక మందన జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు .. విజయశాంతి మధ్య నువ్వా.. నేనా అంటూ సాగే పవర్ఫుల్ సీన్స్ వుండనున్నాయనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. తాజాగా ఈ విషయంపై విజయశాంతి స్పందించారు. “నాకూ .. మహేశ్ బాబుకు మధ్య పోటాపోటీ సన్నివేశాలేమీ వుండవు. ఛాలెంజ్ చేయడం .. సవాళ్లు విసురుకోవడం వంటి సీన్స్ వుండవు. ఈ సినిమాలో కథా పరంగా మా పాత్రల మధ్య మంచి రిలేషన్ ఉంటుంది. ప్రేక్షకులకు మా పాత్రలు బాగా కనెక్ట్ అవుతాయని తెలిపారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa