పద్మావతి’ విషయమై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు ఇంకా చల్లారలేదు. ఈ సినిమా నిషేధించాలంటూ వేసిన పిటిషన్‌ను ఇప్పటికే సుప్రీం కోర్టు మూడుసార్లు తిరస్కరించింది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినిమాకు వ్యతిరేకంగా ఉన్నారు.
దీనిపై అలనాటి నటి షబానా అజ్మీ స్పందిస్తూ సినీ ప్రముఖుల చేత ‘పద్మావతి’కి మద్దతు ఇస్తున్నట్లు సంతకం చేసిన ఓ పిటిషన్‌ను ప్రధాని నరేంద్రమోదీకి అందజేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ పిటిషన్‌లో దాదాపు అందరు సినీ ప్రముఖులూ సంతకాలు చేశారు. కానీ కంగనా రనౌత్ మాత్రం ఇంకా సంతకం చేయలేదు.
దాంతో కంగన దీపికపై ఈ రకంగా పగ తీర్చుకోవాలనుకుంటున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై తాజాగా కంగన స్పందించారు. షబానా అజ్మీ ఎప్పుడూ లెఫ్ట్, రైట్ వింగ్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటారనిఅందుకే ఇంకా పిటిషన్‌లో సంతకం చేయలేదని తెలిపారు. ఈ విషయంలోతనకంటూ కొన్ని అభిప్రాయాలు, ఐడియాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో తాను దీపికకు పూర్తి మద్దతు ఇస్తున్నానని ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం దీపికకు ఉందని చెప్పారు.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపిక పదుకొణె, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా విడుదల విషయమై సంజయ్ ఇటీవల పార్లమెంటరీ ప్యానెల్‌తో సమావేశమయ్యారు. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa