ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంగంలోకి దిగిన 'సైరా'

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2017, 01:58 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రం బుధవారం పట్టాలెక్కేసింది. హైదరాబాద్‌లోని శివార్లలో వేసిన భారీ సెట్‌లో ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభమైంది. షూటింగ్‌లో భాగంగా చిరుతో పాటు ప‌లువురు విదేశీ జూనియ‌ర్ ఆర్టిస్టుల‌పై స‌న్నివేశాల‌ను చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.. సైరాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని, మరోసారి చిరంజీవి, రామ్ చరణ్‌ల ప్రాజెక్ట్‌లో భాగం అయినందుకు చాలా హ్యాపీగా ఉందని అన్నారు.


ఇక స్వాత్రంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీ 2019లో ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa