సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం `బ్యూటిఫుల్`. అగస్త్య మంజు దర్శకత్వంలో నైనా కథానాయిక కాగా సూరి కధానాయకుడిగా నటించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎలాంటి కట్స్ లేకుండా `ఎ` సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేస్తూ ...త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. రొమాంటిక్ ప్రేమ కధాంశంతో వైవిధ్య భరితంగా ఈ చిత్రాన్నితెరకెక్కించాం. హీరోహీరోయిన్లు సూరి, నైనా తమ పాత్రలలో ఒదిగిపోయారు. సన్నివేశాలతో పాటు పాటలు హత్తుకుంటాయి ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, సింగిల్స్ కు విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. అలాగే చిత్రం కూడా ఆధ్యంతం అలరిస్తుందని చిత్ర బృందం వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa