నాగశౌర్య, అనుష్క సినిమాలు ఓకే రోజు విడుదల కాబోతున్నాయి. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `నిశ్శబ్దం`. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 31న విడుదలవుతుంది. కాగా.. ఇదే రోజున నాగశౌర్య హీరోగా నటిస్తోన్న `అశ్వథ్థామ` కూడా విడుదలవుతుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ బుధవారం అధికారికంగా తెలియజేసింది. ఐరా క్రియేషన్స్ శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. రమణ తేజ దర్శకుడు. యాక్షన్ హైలైట్స్ సినిమాలో హైలైట్ కానున్నాయని, అన్బరివు మాస్టర్స్ ఈ చిత్రంలో యాక్షన్‌న సన్నివేశాలను కంపోజ్ చేశారని నిర్మాతలు తెలిపారు. మరో పక్క అనుష్క కూడా వైవిధ్యమైన పాత్రలో నటించిన `నిశ్శబ్దం` క్రాస్ జోనర్‌లో రూపొందింది. మాధవన్, అంజలి, షాలినిపాండే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa