ఓ స్టార్ హీరోకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇస్తున్నామని లీక్ చేసిన కమిటీ ఆ తరువాత ఆ ఆలోచనను విరమించుకుంది. దాంతో సదరు హీరో అవార్డు రాలేదని కోపంతో రగిలిపోయాడట. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ కబీర్ సింగ్ షాహిద్ కపూర్. బాలీవుడ్ లో 2019 అవార్డ్స్ వేదికపై ఓ స్పెషల్ నంబర్ కు డ్యాన్స్ చేయమని సదరు అవార్డు ఆర్టనైజింగ్ కమిటీ షాహిద్ ని కోరిందట. దానికి అతడు సానుకూలంగా స్పందించి డ్యాన్స్ నంబర్ పెర్ఫామ్ చేయడానికి అంగీకరించాడట. ఈ వేదికపై షాహిద్ కపూర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డుని ఇవ్వాలని భావించిన అవార్డు ఆర్గనైజర్స్ చివరి నిమిషంలో ఆ ఆలోచనను విరమించుకున్నారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన షాహిద్ డ్యాన్స్ చేయడానికి నిరాకరించాడట. అయితే ఆ స్థానంలో వరుణ్ ధావణ్ తను నటిస్తున్న సినిమా షూటింగ్ కి బ్రేకిచ్చి మరీ అవార్డు వేడుకలో డ్యాన్స్ చేశాడట. పిలిచి అవమానిస్తే ఎవరికైనా మండుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa