ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విలన్ గా 'కార్తికేయ'

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2019, 05:09 PM

కార్తికేయ 90ఎంఎల్ తో అంతగా ఆకట్టుకోలేకపోవయడు. తన తాజాగా  గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై "చావు కబురు చల్లగా" అనే చిత్రం చేస్తున్నాడు నటుడు కార్తికేయ. ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు కౌశిక్. 2020లో షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనుంది . ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా ఈ చిత్రం రూపొందనుంది. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ సందడి చేయనున్నాడు. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరో వైపు నెగెటివ్ పాత్రలలోను సందడి చేస్తున్నాడు. ఆ మధ్య నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ చిత్రంలో విలన్‌గా కనిపించి అలరించిన కార్తికేయ ఇప్పుడు అజిత్ సినిమాలో విలన్‌గా నటించేందుకు సిద్ధమయ్యాడట. అజిత్ ప్రస్తుతం హెచ్ వినోద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. తెలుగులో అజిత్ మార్కెట్ దృష్ట్యా కార్తికేయను విలన్‌గా తీసుకున్నారట. త్వరలోనే కార్తికేయ ఈ సినిమా షూటింగ్‌కు హాజరవుతాడని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa