ఈరోజు సాయంత్రం 4 :05 నిమిషులకు 'మత్తు వదలరా' చిత్ర ట్రైలర్ ను ప్రముఖ హీరో రానా దగ్గుపాటి రిలీజ్ చేయబోతున్నాడు. దీని తాలూకా పోస్టర్ ను రానా తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు. కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఎన్టీఆర్ విడుదల చేసారు. ఈ పోస్టర్‌లో న్యూస్ పేపర్స్‌పై నిద్రపోతున్న హీరోను చూపించారు. అతని టీషర్ట్‌పై టెక్నీషియన్స్ పేర్లు రాసి ఉండటం దర్శకుడి లోని కొత్త థాట్ చెప్పకనే చెబుతోంది. నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వం వహిస్తుండగా, చిరంజీవి (చెర్రీ) - సుమలత నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే అగ్ర బ్యానర్ గా గుర్తింపు పొందిన నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందించిన ఈ బ్యానర్..తాజాగా స్మాల్ బడ్జెట్ తో కొత్త నటి నటులతో మత్తు వదలరా అనే సినిమా చేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థలు కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి హీరోగా పరిచయం కాబోతున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa