ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ మూవీలో ఆ ఇద్దరు హీరోయిన్స్ లేరట

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 22, 2017, 04:42 PM

ప్రస్తుతం త్రివిక్రమ్ .. 'అజ్ఞాతవాసి' సినిమాతో బిజీగా వున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఆయన వున్నాడు. జనవరి చివరివారంలో ఆయన ఎన్టీఆర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నాడు. ఈ సినిమాలో న్యూ లుక్ కోసం ఎన్టీఆర్ కసరత్తు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. అనూ ఇమ్మాన్యుయేల్ ను ఓకే చేసినట్టుగా కూడా ప్రచారం జరిగింది.


అయితే ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదనీ .. ఇంతవరకూ కథానాయికగా ఎవరినీ అనుకోలేదనేది తాజా సమాచారం. కథానాయికగా ఎవరైతే బాగుంటుందనే విషయాన్ని ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ నిర్ణయానికి వదిలేశాడట. అందువలన ఆయన ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేశాక, హీరోయిన్ గురించిన ఆలోచన చేద్దామనే ఉద్దేశంతో వున్నాడట. అప్పుడు ఎవరిని తీసుకుంటారో .. ఆ అదృష్టవంతురాలెవరో చూడాలి.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa