దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకాలపై ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా 2020 జనవరి 12న విడుదల అవుతుంది. ఈ చిత్రం లోని మరో పాట మంగళవారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు సామాజిక మాధ్యమం అయిన యు ట్యూబ్ ద్వారా విడుదల అయింది. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ గీతాన్ని యువ గాయకుడు అర్మాన్ మాలిక్ అద్భుతంగా ఆలపించారు. సంగీత దర్శకుడు తమన్ తన వీనుల విందైన బాణీలతో అందించారు. ``బుట్ట బొమ్మా..బుట్ట బొమ్మా నన్ను సుట్టూ కుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టూ కుంటివే`' అంటూ సాగే ఈ ఈ పూర్తి గీతం అటు సంగీత ప్రియుల్ని, ఇటు ప్రేక్షకాభిమానులను అలరిస్తుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa