యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఛపాక్'. ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాకేశ్ అనే వ్యక్తి 'ఛపాక్' మూవీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా కథను తానే రాసుకున్నానని, 'బ్లాక్ డే' పేరుతో రిజిస్టర్ చేయించుకున్నానని పేర్కొన్నారు. తాను రాసుకున్న కథకు అనుగుణంగానే 'ఛపాక్' మూవీలో సీన్స్ ఉన్నాయని, ఈ చిత్ర రచయితగా తనకు గుర్తింపు ఇవ్వాలని కోరారు. అప్పటివరకూ ఈ సినిమాను తాత్కాలికంగా నిలిపివేయాలని రాకేశ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 'ఛపాక్' సినిమా నిర్మాతను సంప్రదిస్తే అక్కడ నుంచి స్పందన రాకపోవడంతోనే తాను కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అటు సినిమా యూనిట్ కూడా ఇప్పటివరకూ స్పందించలేదుని రాకేశ్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa