పూరి దర్శకత్వంలో రామ్ చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ సూపర్ హిట్ తో వచ్చిన ఊపులో రామ్ రెడ్ అనే ఓ చిత్రాన్ని ప్రారంభించారు. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని స్రవంతి క్రియేషన్స్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పీటర్ హెయిన్స్ సారధ్యంలో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ యాక్షన్ సన్నివేశాల కొరకు పీటర్ హెయిన్స్ రామ్ ని ఒక రేంజ్ లో కష్టపెడుతున్నారట. ఈ విషయాన్ని రామ్ ఒక వీడియో చేసి మరీ చెప్పారు. తనకు తగిలిన గాయాలను చూపిస్తూ పీటర్ హెయిన్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. రామ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ మొదటి సారి ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తుండగా సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa