తాజాగా కీరవాణి తనయులు శ్రీ సింహ, కాలభైరవ లు మత్తు వదలరా చిత్రంతో పరిచమయ్యారు. ఎం.ఎం.కీరవాణి తనయుడైన శ్రీసింహ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి `మత్తు వదలరా` సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇది వరకే సింగర్ అయిన కాళభైరవ ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తాడు. శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందించిన మైత్రి మూవీస్..మత్తు వదలరా సినిమా ను తెరకెక్కించింది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ కి నూతన దర్శకుడు రితేష్ రానా డైరెక్షన్ చేసాడు. మొదటి రోజు మొదటి షో తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ..విడుదలైన అన్ని సెంటర్లలో మంచి కలెక్షన్లు రాబడుతుంది. ఇక ఈ చిత్రం రెండో రోజు కృష్ణ జిలాల్లో 1,94,266 షేర్ సాధించి..రెండు రోజులకు గాను 4,38,597 షేర్ రాబట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa