నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `అశ్వథ్థామ`. కాగా నిన్న ఈ చిత్రం టీజర్ ను విడుదల అయిన సంగతి తెలిసిందే. అత్యంత గ్రిప్పింగ్ గా ఉన్న ఈ టీజర్ కు యూట్యూబ్ లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. కేవలం 24 గంటల్లో 4.1 మిలియన్ డిజిటల్ వ్యూస్ ను సాధించింది. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో ఈ టీజర్ అగ్రస్థానంలో ఉంది. టీజర్ లో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగ శౌర్య ఈ చిత్రంలో మాస్ హీరోలా సరి కొత్తగా కనిపిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa