నయనతార.. ప్రస్తుతం తమిళంలో నెంబర్ వన్ హీరోయిన్. పారితోషికం విషయంలోనే కాదు.. విజయాల విషయంలోనూ అక్కడ నయనతారదే పై చేయి. ఇది మరోసారి నిరూపితమైంది. నవంబర్‌లో 'అరమ్'తో సంచలన విజయం అందుకున్న ఈ కేరళకుట్టి.. క్రిస్మస్ కానుకగా ఈ నెల 22న విడుదలైన 'వేలైక్కారన్'తోనూ మరో సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకుంది. హిట్ టాక్‌కే పరిమితం కాకుండా.. ఈ సినిమా కలెక్షన్ల విషయంలోనూ దూసుకుపోతోంది. 'తని ఒరువన్' ('ధృవ' ఒరిజనల్ వెర్షన్) తరువాత నయనతార, దర్శకుడు 'జయం' రాజా కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రంలో శివ కార్తీకేయన్ హీరోగా నటించాడు. కాగా, నయనతార తాజా తెలుగు చిత్రం 'జై సింహా' జనవరి 12న తెరపైకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa