ఫిదా` సినిమాతో తెలుగువారిని ఫిదా చేసిన సాయిపల్లవి తాజాగా `ఎంసీఏ` సినిమాతోనూ ఆకట్టుకుంది. ఆ సినిమాకు ఆ స్థాయిలో ఓపెనింగ్స్ రావడానికి సాయి పల్లవి క్రేజ్ కూడా కారణమే. `ఎంసీఏ`లో నానితో జతకట్టిన పల్లవి తన తర్వాతి సినిమాలో శర్వానంద్‌కు జోడీగా నటించబోతోంది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బేనర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడు.వరుస విజయాలు సాధిస్తున్న ట్యాలెంటెడ్ హీరో శర్వా సరసన సాయిపల్లవి నటిస్తుండడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. రొమాంటిక్ సినిమాలను రూపొందించడంలో దిట్ట అయిన హను రాఘవపూడి దర్శకుడు కావడం మరింత క్రేజ్ సంపాదించిపెట్టింది. జనవరి మూడో వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa