విశాల్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇరుంబు థిరాయ్’. తెలుగులో ఈ చిత్రం ‘అభిమన్యుడు’గా రాబోతోంది. పీఎస్.మిత్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుక బుధవారం చెన్నైలో జరిగింది.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘విశాల్ నాకంటే చిన్నవాడిగా అనిపిస్తాడు. అతని కెరీర్‌లోనే ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. మిత్రన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. కానీ ఆయనతో పనిచేస్తుంటే అనుభవం ఉన్న దర్శకుడిగా అనిపిస్తారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది.’ అని చెప్పుకొచ్చారు.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సమంత రతి దేవి అనే సైకాలజిస్ట్ పాత్రలో నటిస్తున్నారు. అర్జున్ వైట్ డెవిల్‌గా విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కథ వినగానే విశాల్ విలన్‌గా నటిస్తానని చెప్పారని కానీ హీరోగా అయితేనే బాగుంటుందని నచ్చజెప్పానని దర్శకుడు మిత్రన్ ఈ సందర్భంగా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa