తారాగణం: అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, శీరత్ కపూర్, తదితరులు
సంగీతం: మణిశర్మ
చాయాగ్రహణం: శ‌్యామ్ కె.నాయుడు
మాటలు: అబ్బూరి రవి
కూర్పు: చోటా కె.ప్రసాద్
నిర్మాత: చక్రి చిగురుపాటి
కథ, కథనం, దర్శకత్వం: విఐ.ఆనంద్
అల్లు అరవింద్ తనయుల్లో ఒకడైన అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో మంచి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వెంటనే ఏదో కమర్షియల్ సినిమా చేసేయాలనే ఆలోచనతో కాకుండా థ్రిల్లర్ సినిమా చేయడానికి ఆసక్తి చూపాడు. అందులో భాగంగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు విఐ. ఆనంద్ దర్శకత్వంలో శిరీష్ చేసిన సినిమా ‘ఒక్క క్షణం’. ప్యారలల్ లైఫ్స్ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి ఆసక్తిని కలిగించాయి. మరి సినిమా ప్రేక్షకులను మెప్పించేలా ఉందా? లేదా? అని తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం..
కథ: జీవా (అల్లు శిరీష్)కి చిన్నప్పటి నుంచి ఫోకస్ ఎక్కువ. అనుకున్న పనిని సాధించేవరకు వదలడు. తల్లిదండ్రులు (కాశీ విశ్వనాథ్ , రోహిణి) కూడా అతనికి సపోర్ట్ చేస్తుంటారు. ఒకసారి షాపింగ్ కోసమని వాళ్ల కుటుంబం ఇన్ ఆర్బిట్ మాల్‌కి వెళ్తారు. అక్కడ అతని జ్యోత్స్న (సురభి)ని చూస్తాడు. వాళ్లిద్దరు ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. జ్యోత్స్న ఇంటికి ఎదురుగా శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), అతని భార్య స్వాతి (సీరత్ కపూర్) ఉంటారు. జ్యోత్స్నకి పీపుల్స్‌ని రీడ్ చేయడం అలవాటు. ఆ క్రమంలో భాగంగా ఆమె శ్రీనివాస్ దంపతులను పరిశీలిస్తూ ఉంటుంది. వారి మధ్య గొడవలు పోవడానికి సాయం కూడా చేయాలనుకుంటారు. ఆ క్రమంలో భాగంగా జీవాకు తన జీవితం శ్రీనివాస్ జీవితం ఒకేలా ఉందని అర్థమవుతుంది. అదే విధంగా స్వాతి, జ్యోత్స్న జీవితాలు కూడా ఒకే ర కంగా ఉన్నాయని తెలుస్తుంది. వాటి వల్ల ఏమయింది? అసలు స్వాతికి ఏమవుతుంది? ఆమెను చూసి జ్యోత్స్న ఎందుకు భయపడుతుంది? సైన్స్, జాతకాలను దాటి సంకల్పం బలీయమైందా? మనసులో బలమైన సంకల్పం ఉంటే మిగిలినవి ఏవీ ఏమీ చేయలేవా? అనే అంశాలతో ముడిపడిన చిత్రమిది.
విశ్లేషణ: ఇందులో ముందుగా నటీనటుల విషయానికి వస్తే.. ముందు అల్లు శిరీష్ గురించి చెప్పుకోవాలి. నటన, డాన్సులు పరంగా శిరీష్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. తల్లి పాత్రలో చేసిన రోహిణితో చేసిన ఎమోషనల్ సీన్స్ బావున్నాయి. ఇక హీరోయిన్ సురభి కూడా పాత్ర పరంగా చక్కగా నటించింది. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన సురభికి నటన పరంగా మంచి పాత్ర దొరికిందనాలి. ఇక అవసరాల శ్రీనివాస్ పాత్ర పరిమితి చాలా తక్కువగా ఉంది. ఆ పాత్రలో తను న్యాయం చేశాడు. భార్యపై ప్రేమ ఉన్నా, పరిస్థితులు తనని విలన్ చేస్తే.. ఏం చేయాలో తెలియక సతమతమయ్యే భర్తగా అవసరాల నటన బావుంది. ఇక సినిమాలో శీరత్ కపూర్ చాలా కీలకమైన పాత్రలో నటించింది. తను తెలియక చేసిన తప్పు కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి దాని ద్వారా ఆత్మహత్య చేసుకునే పాత్రలో శీరత్ నటన బావుంది. ఇక సినిమాలో మిగిలిన పాత్రల్లో నటించిన కాశీ విశ్వనాథ్, రోహిణి, ప్రవీణ్, దాసరి అరుణ్, కారు మంచి రఘు, సత్య తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికంగా చూస్తే ప్యారలల్ లైఫ్ అనే థియరీ ఆధారంగా దర్శకుడు వి.ఐ.ఆనంద్ కథను రాసుకున్నాడు. ప్రారంభం నుండి సినిమాను ఆసక్తికరంగా ముందుకు నడిపించడంలో సక్సెస్ సాధించాడు. అయితే సినిమా ఇంటర్వెల్ వరకు మాత్రమే మెప్పిస్తుంది. ఇంటర్వెల్ నుండి అసలు కథలోకి ఎంటర్ అయిన తర్వాత కథలో తిరిగే మలుపులు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతాయి. ముఖ్యంగా ప్యారలల్ లైఫ్ అనే పాయింట్‌కు సంబంధించిన మెయిన్ పాయింట్ ఎలా రివీల్ అవుతుందనే విషయంలో పాత్రలు ఎక్కువ కావడంతో కథ గమనం పక్కదారి పడుతుంది. ఇక మణిశర్మ పాటలు ఆకట్టుకునేలా లేవు. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. ఇక శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ బావుంది. సినిమా ఫస్టాఫ్ లో ఉన్న ఆసక్తి సెకండాఫ్‌లో కనపడదు. మెయిన్ థ్రెడ్ రివీల్ అవుతున్నప్పుడు ఆసక్తి కథలో మిస్ అయ్యింది. మొత్తంగా చూస్తే సినిమా సూపర్
మూవీ రివ్యూ : 3.25/5
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa