ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వోగ్ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం కరీనా ఇచ్చిన స్టిల్ చూస్తే

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 29, 2017, 02:30 PM

బాలీవుడ్ లో కొందరు హీరొయిన్ల సౌందర్య రహస్యం ఏమో కాని పెళ్లై పిల్లలు పుట్టాక కూడా బిగిసడలని శరీర సౌష్టవంతో ఇప్పటి కుర్రకారుకు కూడా మతులు పోగొట్టేలా ఉంటారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్ - మలైకా అరోరా లాంటి వాళ్ళు ఇదే కోవలోకి వస్తారు. కాని తాను మాత్రం వీళ్ళ కంటే చాలా చాలా స్పెషల్ అని ఋజువు చేస్తోంది కపూర్ ఫ్యామిలీ గారాల పట్టి కరీనా కపూర్. సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకున్నాక సినిమాలు కొంత కాలం మానేసిన కరీనా తైమూర్ ఆలి ఖాన్ కి జన్మనిచ్చి ఇటీవలే మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంది. భార్యగా - తల్లిగా తన బాధ్యతలు నెరవేరాయి కనక మళ్ళి గ్లామర్ ప్రపంచం వైపు దృష్టి పెట్టింది. వోగ్ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం కరీనా ఇచ్చిన స్టిల్ చూస్తే ఎంత ప్రవరాఖ్యుడికైనా మతి చెడిపోవడం ఖాయం. సైఫ్ అలీ ఖాన్ అదృష్టానికి అసూయ చెందటం గ్యారెంటీ.


క్లీవేజ్ ని ఎక్కడా చూపించాలో అక్కడ చూపిస్తూ ఎక్కడ దాచాలో అక్కడ దాస్తూ నది ఒడ్డున ఇచ్చిన భంగిమ ఆదరహో అనిపిస్తోంది. తన ఫిట్ నెస్ విషయంలో ఏ మాత్రం రాజీ పడటం ఇష్టం లేని కరీనా దానికి తగ్గట్టే వర్క్ ఔట్స్ చేస్తూ ఫిజిక్ ని కాపాడుకుంటున్న తీరుని చూస్తే ఇప్పటి హీరొయిన్స్ కి స్పెషల్ గా క్లాసులు చెప్పించినా తప్పు లేదు. సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి నాలుగు పదుల వయసులో వెంటపడి ప్రేమించి మరీ కరీనాను పెళ్లి చేసుకోవడం న్యాయమే అనిపిస్తుంది. త్వరలోనే క్రేజీ ప్రాజెక్ట్స్ తన రీ ఎంట్రీ ఇవ్వబోతున్న కరీనా ఇలాంటి హాట్ స్టిల్స్ తో తాను రేస్ నుంచి తప్పుకోలేదని స్పష్టంగా చెప్పినట్టే 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa