ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మ‌రో పోస్ట‌ర్‌తో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న నాని

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 30, 2017, 11:38 AM

నటుడిగా రాణిస్తున్న నాని వాల్ పోస్టర్ అనే బేనర్ పై తొలి సారిగా అ అనే ప్ర‌యోగాత్మ‌క‌ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిత్యామేనన్, కాజల్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ఒక్కో పాత్ర లుక్స్ విడుదల చేస్తూ వస్తున్నాడు నాని. రీసెంట్‌గా ఇప్పుడిప్పుడే క‌మెడీయ‌న్‌గా ఎదుగుతున్న ప్రియ‌ద‌ర్శి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో మ‌నోడు ఫేస్ నిండా పిండి పూసుకొని గుడ్లప్ప‌గించుకొని చూస్తున్నాడు. ఈ పోస్ట‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే అ చిత్రంలో ప్రియ‌ద‌ర్శి వంట దొంగ‌గా క‌నిపిస్తాడ‌నే సందేహం అభిమానుల‌లో క‌లుగుతుంది. ఏదేమైన చిత్రానికి సంబంధించి ఒక్కొక్క‌టిగా వ‌స్తున్న పోస్ట‌ర్స్ అభిమానులని ఎంత‌గానో ఆకట్టుకోవ‌డ‌మే కాక చిత్రంపై మ‌రింత ఆస‌క్తి పెంచుతున్నాయి. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న అ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుండగా, ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa