ఎప్పుడు ఏవిధంగా కనపడాలి ఇలియానాకు బాగా తెలుసు. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తనదైన శైలిలో నటించిన ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా, తెలుగులోని అగ్ర హీరోలతో సైతం నటించిన మెప్పించింది. అయితే ఈ సొగసరి తెలుగు తెరను వీడి బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ కూడా తన సత్తాచాటింది. తరువాత ప్రేమలో పడి సినీజీవితాన్ని దూరం పెట్టింది. కానీ ఇటీవల తన ప్రేమకు బ్రేకప్ చెప్పి మళ్లీ సినిమాల్లోకి రావడానికి ప్రయత్నిస్తుంది. తెలుగులో ఈ భామ రవితేజతో నటించిన "అమర్ అక్బర్ ఆంటోని" ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమాలో ఇలియానా లావుగా ఉండడంతో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇలియానా సన్నబడాలని నిర్ణయించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa