అందాల కథానాయిక కీర్తి సురేశ్, సినిమా నేపథ్యం కలిగిన కుటుంబం నుంచే వచ్చింది. ఆమె తల్లి మేనక గతంలో తమిళ - కన్నడ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. అప్పట్లో ఆమె రజనీకాంత్ సరసన 'నేత్రిక్కన్' అనే సినిమా చేశారు. ఆ సినిమా రజనీ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. ఇంతకాలానికి ఇప్పుడు ఆ సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఆ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన ధనుశ్ కి రావడం .. ఆయన రంగంలోకి దిగిపోవడం జరిగిపోయాయి. గతంలో రజనీ చేసిన పాత్రను ధనుశ్ పోషించనుండగా, మేనక ధరించిన పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఈ సినిమాను ధనుశ్ తన సొంత బ్యానర్లో నిర్మించనున్నట్టు చెబుతున్నారు. దర్శకుడు ఎవరనేది త్వరలోనే తెలియజేయనున్నారు. ధనుశ్ - కీర్తి సురేశ్ ఇంతకుముందు 'రైల్' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa