స్టార్ బ్యూటీ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘భాగమతి’. అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి వంటి హిట్ సినిమాలతో సత్తాచాటిన ఆమె మరోసారి ఈ చిత్రంతో తన టాలెంట్‌ను చూపించబోతోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అనుష్క కొత్త లుక్‌ను విడుదల చేసింది సినిమా యూనిట్. ఈ అందాలభామ కొత్త లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదివరకే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌తో అనుష్క అందరినీ భయపెట్టేసింది. వీటితో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. తాజాగా విడుదలైన కొత్త లుక్‌లో అనుష్క ఒక యోగిని తరహాలో ఉంది. దర్శకుడు అశోక్ ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ చేశాడనే అనిపిస్తోంది. పలు సినిమాలతో పోటీపడుతూ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలకావడానికి ‘భాగమతి’ సిద్ధమవుతోంది. ‘బాహుబలి’ తర్వాత అనుష్క కనిపించేఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa