అంతర్జాతీయ నటిగా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా, బాలీవుడ్‌లో పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. అయినప్పటికీ కొన్ని సినిమాలను నిర్మించాలని యోచిస్తోంది. అందులో భాగంగానే భారత్ విచ్చేసిన ప్రతిసారీ తన సినిమాల్లో నటించే హీరోయిన్ల కోసం వెతుకుతోంది. ఈ నేపథ్యంలో తాను పిల్లలు, వీధికుక్కల కథాంశంతో నిర్మించబోయే సినిమాలో నటించాలని చాలా మంది హీరోయిన్లను అడిగిందట. అయితే వారంతా ప్రియాంకకి నో చెప్పేశారట.
ఈ నేపథ్యంలో ఇటీవల భారత్ వచ్చినపుడు ఇదే కథను ఆలియాభట్‌కి వివరించి, ఆ చిత్రంలో నటించాలని ప్రియాంక ఆమెను కోరిందట. స్వతహాగా జంతువులంటే అమితమైన ప్రేమ చూపించే ఆలియాభట్ ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి ప్రియాంక గానీ, ఆలియా గానీ అధికారికంగా ఎలాంటి విషయాన్ని వెల్లడించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa