ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆమెకు మరొకరితో సంబంధం ఉంది

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 02, 2020, 08:07 PM

ఎట్టి పరిస్థితుల్లోను తాను సనంను పెళ్లి చేసుకోనని తెలిపాడు బిగ్ బాస్ ఫేమ్ దర్శన్ .తనను  పెళ్లి   చేసుకుంటానని  దర్శన్‌  నమ్మించి మోసం చేశాడని నటి సనంశెట్టి సంచలన ఆరోపణలు చేసింది. అయితే  దీనిపై  దర్శన్‌  స్పందిస్తూ  ఈ  విషయమై దర్శన్‌  మీడియాతో మాట్లాడుతూ  గతంలో తనకు, సనంశెట్టికి నిశ్చితార్ధం జరిగిన మాట వాస్తవ మేనని, ఇది ఆమె తల్లిదండ్రులకు మాత్రమే తెలుసునని చెప్పాడు. అయితే తన చెల్లెలి పెళ్లికి ఇబ్బంది కలుగుతుందేమోనని తన ఇంట్లో ఈ విషయాన్ని చెప్పలేదన్నాడు. నిజానికి సనంశెట్టి తనకు ఆర్ధిక, మానసికంగా ఎంతో సహాయం చేసిందని, అయితే ‘బిగ్‌బాస్‌’ నుంచి బయటకి వచ్చాక ఆమె మరొకరితో సంబంధం కలిగి ఉందని ఆరోపించాడు. అతను ఎవరనేది తాను చెప్పలేనని, ఇంత జరిగాక ఆమెతో కలిసి జీవించలేనని, అందుకే ఆమెని పెళ్లి చేసుకోబోనని చెప్పాడు. ఇకపోతే, సనంశెట్టి చేసిన సాయాన్ని తాను మరువలేనని, ఆ కారణంగానే ఆమెపై తాను పోలీసు కేసు పెట్టబోవడం లేదని చెప్పాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa