ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భీమవరం అమ్మాయి తో ‘నిఖిల్’ నిశ్చితార్థం

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 03, 2020, 12:24 PM

యువ కథానాయకుడు నిఖిల్‌ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన ప్రేయసి, వైద్యురాలు పల్లవి వర్మతో నిఖిల్‌ నిశ్చితార్థం గత శనివారం గోవాలో జరిగింది. పెద్దలను ఒప్పించి తమ ప్రేమను తెలిపిన చోటే నిశ్చితార్థం జరుపుకున్నారీ జంట. భీమవరం అమ్మాయి పల్లవి వర్మ వైద్యురాలిగా పనిచేస్తోంది. నిఖిల్‌ ఇటీవలే అర్జున్‌ సురవరం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం అతనికి చేతినిండా సినిమాలున్నాయి. వరుస చిత్రాలతో తీరిక లేని నిఖిల్‌ జీవితంలోకి వివాహ ఘడియలు వచ్చేశాయి. ఏప్రిల్‌ 16 నిఖిల్‌, పల్లవి వర్మ పెళ్లి వేడుకలు జరగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa