ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెలాఖరుకు ‘హిట్’

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 04, 2020, 02:17 PM

విశ్వక్‌సేన్‌ హీరోగా నటిస్తున్న సినిమా హిట్‌. రుహానీ శర్మ నాయికగా నటిస్తోంది. నాని సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐపీఎస్‌ ఆఫీసర్‌ విక్రమ్‌ రుద్రరాజు పాత్రలో విశ్వక్‌ సేన్‌ కనిపించనున్నారు. పోలీస్‌ వేట నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం హిట్‌ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ నెల 28న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. మణికందన్‌ సినిమాటోగ్రఫీ, వివేక్‌ సాగర్‌ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa