దర్శకుడు విజయ్ మురుగన్ తెరకెక్కిస్తోన్న చిత్రం కాక్ టెయిల్. ఈ మూవీలో కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ టైటిల్ మద్యానికి సంబంధించిన పదం. అయితే ఈ పోస్టర్‌లో తమిళంలో ఆరాధించే దైవం మురుగన్ వేషధారణలో ఉన్న యోగిబాబు స్టిల్ చూసి టైటిల్‌కి, ఈ పోస్టర్‌కి ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్న తలెత్తింది. ‘కాక్‌టెయిల్’ టైటిల్‌గా ఉన్న సినిమాకి ఇలాంటి పోస్టర్ విడుదల చేయడం ఏమిటని పలువురు బహిరంగంగానే విమర్శిస్తునారు. అయితే ఎవరి మనోభావాల్ని కించపరిచేలా ఈ సినిమా కథగానీ, పోస్టరుగానీ రూపొందించ లేదని, తాను కూడా మురుగన్ భక్తుడినేనని, తన పేరులోనూ మురుగన్ ఉందని దర్శకుడు విజయ్ మురుగన్ వివరణ ఇచ్చాడు. ఈ సినిమాలో యోగిబాబు కూడా మురుగన్ భక్తుడిగానే నటిస్తున్నారని, సినిమా చూశాక అందరూ హర్షిస్తారని వెల్లడించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa