ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'టైటానిక్' మూవీ రీమేక్..?

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 04, 2020, 04:00 PM

977లో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శక నిర్మాత జేమ్స్ కామెరాన్ రూపొందించిన ఆంగ్ల చిత్రం 'టైటానిక్'. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. మొదటి విడుదలే కాకుండా 2012 మరియు 2017 లో వచ్చిన విడుదలలన్నీ కలిపి ఈ సినిమాకు అమెరికాలో 659.4 మిలియన్ డాలర్లు ఆదాయం రాగా ఇతర దేశాల్లో 1.528 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం రణబీర్‌కపూర్, అలియాభట్ జంటతో 'టైటానిక్' రీమేక్ చేయాలనుకుంటునట్లు బాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీలలో ఒకరైన జాకీ భగ్నానీ తెలియజేసారు. తనకు హాలీవుడ్ మూవీ 'టైటానిక్' అంటే ఎంతో ఇష్టమని, దానిని హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. రణబీర్, అలియాలను జాక్, రోజ్ పాత్రల్లో చూడాలనుకుంటున్నానని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa