దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరీస్.. చరణ్ జోడీగా ఆలియా భట్ నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను జరుపుకుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాను జూలై 30వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగు మధ్యలో ఏర్పడిన కొన్ని అంతరాయాల వలన .. సాంకేతిక కారణాల వలన వాయిదా పడే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపించింది. ఆ వార్తని నిజం చేస్తూ ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. ఈ సినిమాను 2021 జనవరి 8 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు 'ఆర్.ఆర్.ఆర్' చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. దీంతో ఫాన్స్ నిరాశ చెందుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa