ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ సినిమా టైటిల్ మార్చారా..?

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 06, 2020, 03:46 PM

పూరి జగన్నాథ్ - చార్మీ కలిసి మరో సినిమాను నిర్మిస్తున్నారు. పూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయకుడిగా విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. ఈ సినిమాకి 'ఫైటర్' అనే టైటిల్ ను అనుకున్నారు. ఆ తరువాతనే ఈ ప్రాజెక్టులోకి కరణ్ జొహార్ వచ్చి చేరడం, తెలుగుతోపాటు ఈ సినిమాను హిందీలోను విడుదల చేయాలనుకోవడం జరిగింది.


ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టైటిల్ మార్చే అవకాశం ఉందనే టాక్ వచ్చింది. కథా పరంగా ఈ సినిమాకి 'లైగర్' అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో కరణ్ - పూరి వున్నారని సమాచారం. మగ సింహానికీ .. ఆడపులికి పుట్టిన పిల్లను 'లైగర్' అంటారు. కథాపరంగా ఈ టైటిల్ అయితే బాగుంటుందని భావించి సెట్ చేశారని అంటున్నారు. ఈ సినిమాతో తెలుగు తెరకి అనన్య పాండే పరిచయమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa