ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రెండు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన ప్రియాంక జవల్కర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 06, 2020, 04:46 PM

విజయ్ దేవరకొండ సరసన నాయికగా 'టాక్సీవాలా' సినిమాతో తెలుగు తెరకి ప్రియాంక జవల్కర్ పరిచయమైంది. తొలి సినిమానే విజయ్ దేవరకొండతో చేసే ఛాన్స్ రావడం .. 'టాక్సీవాలా' హిట్ కావడంతో ఈ సుందరి దశ తిరిగిపోయినట్టేనని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో అలా జరగలేదు. ఆ తరువాత అమ్మడు ప్రేక్షకులను పలకరించలేదు. దాంతో ప్రియాంక జవల్కర్ ను అంతా మరిచిపోయారని చెప్పాలి.


అయితే అదృష్టం కలిసొచ్చి ఈ సుందరిని రెండు అవకాశాలు పలకరించాయి. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరో అనిపించుకున్న కిరణ్, మరో సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. ఈ  సినిమాలో కథానాయికగా ఆయన ప్రియాంక జవల్కర్ ను ఎంపిక చేసుకున్నాడు. ఇక శివ కందుకూరి హీరోగా దర్శకురాలు సుజన ఒక సినిమాను రూపొందించనుంది. ఈ సినిమాలో ఆయన జోడీగా ఆమె ప్రియాంకను తీసుకుంది. ఈ రెండు విజయాన్ని సాధిస్తే ప్రియాంక కెరియర్ ఊపందుకునే అవకాశాలు వున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa