ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రకు మూడు రాజధానులా..? ముగ్గురు ముఖ్యమంత్రులైన ఆశ్చర్యపోనవసరం లేదు : షకీలా

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 06, 2020, 05:20 PM

ఏపీకి మూడు రాజధానుల అంశం ఎంత హాట్ టాపిక్ గా మారిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అంశంపై ఇప్పటికే ప్రతిపక్షాల సెటైర్లు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులూ తమ అభిప్రాయాలు వెల్లడించారు. తాజాగా, ప్రముఖ శృంగార తార షకీలా తొలిసారిగా రాసిన కుటుంబ కథా చిత్రం టీజర్ లో ఏపీకి మూడు రాజధానుల అంశం గురించిన ప్రస్తావన ఉంది.  కుర్చీలో కూర్చుని ఉన్న షకీలా ఓ పత్రికలో పతాక శీర్షిక ‘ఆంధ్రాకు మూడు రాజధానులు’ను చూడటం ఆ టీజర్ లో కనబడుతుంది. ‘ఆంధ్రాకు మూడు రాజధానులా?’ అంటూ తన పక్కనే నిలబడి ఉన్న ఓ వ్యక్తిని షకీలా ప్రశ్నించగా...‘అవును మేడమ్.. జగనన్న మూడు రాజధానులు చేశారుగా’ అని సమాధానం చెబుతాడు. ‘ఒక్క స్టేట్ కే మూడు రాజధానులా? పోను పోను.. ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు’ అంటూ షకీలా విస్మయం వ్యక్తం చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa