ఈ సంక్రాతి క్రేజ్ చూసాక టాలీవుడ్ హీరోల్లో చాలామంది వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తూ సినిమాలు మొదలెట్టబోతున్నారు. అందులో మహేష్ - వంశి పైడిపల్లి చిత్రం ఒకటి, అల్లు అర్జున్ - సుకుమార్ చిత్రమొకటి, పవన్ కళ్యాణ్ - క్రిష్ చిత్రం, ఒకవేళ ఆ రేస్ లో ప్రభాస్ - రాధాకృష్ణ చిత్రం కూడా బరిలో నిలవొచ్చు కూడా.. ఆ టైం కి అంటే 2021 సంక్రాంతికి టైం కి ఇంకెన్ని సినిమాలు లైన్ లోకి వస్తాయో తెలియదు. అయితే తాజాగా ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలయికలో బడా మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాని జులై 31 2020 నుండి పోస్ట్ పోన్ చేసి 2021 జనవరి 8 అంటే సంక్రాంతి టైం కి డేట్ ఫిక్స్ చెయ్యడంతో.. ఇపుడు అంతా రాజమౌళి చేసిన పనికి కక్కలేక మింగలేక ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa