ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తనికెళ్ళ భరణి ని ఆపుతున్నది ఎవరు..!

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 06, 2020, 06:55 PM

ఏపీ లో అల్లకల్లోలంగా ఉన్న టిడిపి పార్టీలోకి తనికెళ్ళ భరణి వెళ్ళబోతున్నట్లుగా ఓ న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. తనికెళ్ళ భరణి ఎప్పటి నుండో టిడిపి పార్టీలో చేరాలని యోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే ప్రస్తుతం టిడిపి పార్టీ పరిస్థితి ఏపీలో అగమ్య గోచరంగా ఉంది. రాజధాని విషయంలోనే కాదు.. ప్రస్తుతం టీడీపీ పార్టీ నుండి ఎమ్యెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీని వీడి వైసిపి తదితర పార్టీలలోకి జంప్ అవుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో టిడిపి పార్టీలోకి వెళ్లడం కరెక్ట్ కాదని తనికెళ్ళ భరణిని చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు ఆపుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. పార్టీ పరిస్థితి బావుండలేదు, అలంటి టైం లో మీరు టిడిపి పార్టీలోకి వెళ్లడం సబబు కాదు అని రాఘవేంద్ర రావు లాంటి వాళ్ళు తనికెళ్ళ భరణి ని ఆపుతున్నట్లుగా ఫిలింనగర్ టాక్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa