థప్పడ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న నటి తాప్సీ బిగ్ బాస్ షో పై తనదైన శైలిలో చెలరేగింది. ఒకప్పుడు బిగ్ బాస్ చాలా పద్దతిగా ఉండేది. ఎంతో ఆసక్తికరంగాను ఉండేది. కానీ రాను రాను షోలో హింస భయంకరంగా పెరిగి పోయింది. ఒకర్ని ఒకరు తిట్టుకోవడం.. గొడవలు పడటం చూస్తుంటే ఇరిటేషన్ వచ్చేస్తోంది. ఇది బిగ్ బాస్ షోయేనా అన్న సందేహం కలుగుతోంది. నిజంగా బిగ్ బాస్ పరువు బజారున పడిందేమో అనిపిస్తుంది. ఇలాంటి షోను ప్రేక్షకులు అంతే ఆసక్తిగా చూడటం నచ్చలేదు. కంటెంస్టెంట్లు మధ్య జరిగే తగాదాలు ప్రేక్షకులు తమ ఇంట్లో కూడా జరిగితే ఇలాగే ఎంజాయ్ చేస్తారా అని ప్రశ్నించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa