దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' లో నటిస్తున్న నటీనటులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయదేవగన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలో శ్రియ శరన్ కీలక పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో హాట్ బ్యూటీ కూడా నటిస్తుందని తాజా సమాచారం. ఐటం సాంగ్స్ కు మోస్ట్ ఫెవరెట్ గా మారిపోయిన హంసానందిని ఆర్ ఆర్ ఆర్ లో నటించనుందంట. మరి ఈ సినిమాలో హంస నందిని ఐటం సాంగ్ లో నటిస్తుందా..? లేక ఒక పాత్రలో నటిస్తుందా..? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa