ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాజమౌళి వెర్సెస్ శంకర్'.. ఎవరిది పైచేయి..?

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 06, 2020, 08:03 PM

2021లో సంక్రాంతికి రాజమౌళి వెర్సెస్ శంకర్ మధ్యన మొదటిసారిగా బాక్సాఫీసు యుద్ధం జరగబోతుందా..? రాజమౌళి మెగా బడ్జెట్ ఎంటర్టైనర్ 'ఆర్.ఆర్.ఆర్' జనవరి 8 న విడుదలకు డేట్ లాక్ చేసారు. అయితే కోలీవుడ్ లో కమల్ హాసన్ నటించిన తన బ్లాక్ బస్టర్ చిత్రం ఇండియన్ (తెలుగులో భారతీయుడు) కు సీక్వెల్ అయిన శంకర్ - కమల్ హాసన్ ల ఇండియన్ 2 జనవరి 14 న సంక్రాంతి కోసం థియేటర్లలోకి రానుంది. అంటే రాజమౌళి, శంకర్ చిత్రాలు ఆరు రోజుల వ్యవధిలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. శంకర్ కమల్ తో ఇండియన్ 2 ని, రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' తో పోటీ పడుతున్నారు. బాక్సాఫీసు వార్ లో శంకర్‌పై రాజమౌళి పైచేయి సాధిస్తాడా..? లేదంటే రాజమౌళి పై శంకర్ పైచేయి సాధిస్తాడా..? అనేది మాత్రం థ్రిల్లింగ్ సస్పెన్స్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa