ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుష్క పెళ్లిపై ఆసక్తికర వార్త

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2020, 10:50 AM

టాలీవుడ్ హీరోయిన్లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనుష్క. 1981 సంవత్సరంలో జన్మించిన ఈమె 39 ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. దీంతో ఈమె నటించే సినిమాల కంటే పెళ్లి మ్యాటరే జనాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఈ నేపథ్యంలో అనుష్క పెళ్లిపై ఆసక్తికర వార్త ఒకటి బయటకొచ్చింది. నిజానిజాల సంగతేమో గానీ ఆ వార్త ఆసక్తితో పాటు ఆశ్చర్యం కూడా కలిగిస్తోంది. వివరాల్లోకి పోతే..రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది అనుష్క. స్వీటీ అందం, అభినయం చూసి అన్ని భాషా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈమె వివరాలు, పెళ్లి చేసుకుందా? లేదా? అనే విషయాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అనుష్క పెళ్లి మ్యాటర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.మరోవైపు అదే బాహుబలి సిరీస్ ద్వారా వరల్డ్ స్టార్‌గా ప్రభాస్‌తో అనుష్క రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తుందనే వార్తలు విన్నాం. ఆ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ రూమర్స్ హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలపై అటు అనుష్క, ఇటు ప్రభాస్ క్లారిటీ ఇచ్చేయడంతో తాజాగా మరో రూమర్ బయటకొచ్చింది.


 


టీమిండియా క్రికెటర్‌తో అనుష్క పెళ్లి జరగబోతుందనే కొత్త ప్రచారం వెలుగులోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఉత్తరాదికి చెందిన ఓ ఆటగాడితో అనుష్క ఏడడుగులు వేయనుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ షికారు చేస్తున్నాయి. దీనిపై అఫీషియల్ సమాచారం లేకపోవడంతో ఇది కొందరు క్రియేట్ చేసిన రూమర్ అనే టాక్ కూడా వినిపిస్తోంది.ఇకపోతే అనుష్క సినిమాల కోసం చాలాకాలంగా ఎదురు చూస్తోంది ప్రేక్షకలోకం. బాహుబలి సిరీస్ ద్వారా తన పాపులారిటీని మరింత పెంచుకున్న స్వీటీ.. ఆ తర్వాత 'భాగమతి' సినిమాతో అలరించింది. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అనుష్క తిరిగి ఇప్పుడు 'నిశ్శబ్దం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా 'నిశ్శబ్దం' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌కి చెందిన పలువురు న‌టీన‌టుల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమా రూపొందుతోంది. అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ, ఇంగ్లీషు, హిందీ, మ‌ల‌యాళం భాష‌ల్లో భారీ స్ధాయిలో రిలీజ్ చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa