ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అల వైకుంఠపురములో' సీక్వెల్ ప్లాన్ లో చిత్ర బృందం..?

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2020, 04:26 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'అల వైకుంఠపురములో' ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చి బాక్సాఫీస్ షేక్ చేసింది. రిలీజ్ అయిన మొదటి రోజు అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓవర్సీస్ లో కూడా 2 మిలియన్స్ దాటి రచ్చ చేసింది. వాస్తవానికి ఈ మూవీ రిలీజ్ కి ముందే రికార్డుల మోత మోగించింది. ఈ మూవీలో సామజవర గమన సాంగ్ యూట్యూబ్ సంచలనాలు సృష్టించింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యానికి తన సంగీతంతో అమృతం పోశారు ఎస్ఎస్ థమన్. ఆ తర్వాత రాములో రాముల సాంగ్ కూడా ఎన్నో రికార్డులు సృస్టించింది. నాపేరు సూర్య సినిమా తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' హిట్ తో ఆ కసి తీర్చుకున్నారు.
ఈ మూవీ సక్సెస్ తో చిత్ర యూనిట్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. నాన్ బాహుబలి చిత్రంగా పలు రికార్డులు సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన చిత్రబృందం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ రీసెంట్‌గా బన్నీ తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి సీక్వెల్‌పై చర్చలు జరిపాడట. అయితే అల రేంజ్ లో మంచి స్టోరీ దొరికితే తప్పకుండా సీక్వెల్ ప్లాన్ చేయాలని అన్నారట అరవింద్‌. దాంతో ఇప్పటి నుంచి తన మెదడుకు మరోసారి పదును పెడుతున్నారటర మాటల మాంత్రికుడు. అయితే అల్లు అర్జున్ రెండేళ్లు గ్యాప్ తీసుకున్న తర్వాత తనకు గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ సినిమాలు అందించిన త్రివిక్రమ్ నే నమ్ముకోవడం.. సంక్రాంతి పండుగ కానుకగా అల సూపర్ హిట్ కావడం అన్నీ కలిసి వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే అల వైకుంఠపురములో చిత్ర సీక్వెల్‌కి మార్గం సుగమం అయినట్టే అని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాకపోతే ఇది పట్టాలేక్కడానికి కాస్త సమయం పట్టేలా ఉందని అంటున్నారు. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తుండగా, దీని తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa