ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ మూవీ లిరికల్ సాంగ్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2020, 06:10 PM

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మిస్ ఇండియా’. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా నుండి ‘కొత్తగా కొత్తగా’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. మంచి ఫీల్ తో సాగే ఈ పాటను కళ్యాణ్ చక్రవర్తి చకాన్ని సాహిత్యాన్ని అందించారు. ఇక క్రేజు మ్యూజిక్ తో తమన్ తన ఫామ్ ను అలాగే కొనసాగించాడు. అలాగే ఈ పాటను పాడిన శ్రేయ ఘోషాల్ తన అద్భుతమైన గాత్రంతో పాటకు ప్రాణం పోసింది.
ఇక ఇప్పటికే ఈ చిత్ర టీజర్ విడుదల అయి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కాగా మహిళల పై ఒక్కో స్టేజిలో ఒక్కో రాకంగా దాడుల జరుగుతాయి. ఆ దాడులని ఈ చిత్రంలో విశ్లేషాత్మకంగా చూపించనున్నారని సమాచారం. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న కీర్తి సురేష్.. మరి ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో కూడా ప్రేక్షకుల ముంమనసును గెలుసుకుంటుందేమో చూడాలి. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 






 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa