మెగాస్టార్ చిరంజీవి పై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవికి నంది అవార్డ్స్ కమిటీ చైర్మన్ పదవిని ప్రభుత్వం ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని.. ఆయనకు ఇవ్వడం వద్దే వద్దని స్పష్టం చేశారు. ఎందుకంటే చిరంజీవికి ఉన్న స్థాయికి ఆ గౌరవం సరిపోదని.. కమిటీ చైర్మన్ అయితే అవార్డులు ప్రకటిస్తే గొడవ చేసి ఆయన పరువు తీస్తారని.. పనీ పాటా లేనోళ్ల కు నంది అవార్డ్స్ కమిటీ చైర్మన్ చైర్మన్ పదవులు ఇవ్వాలని సూచించారు. చిరంజీవికి ఇస్తే తాను ఆయనతో గొడవపడి మరీ తీయించేస్తానని షాకింగ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ కు సమస్యలు వస్తే చిరంజీవి ముందుంటారని.. పైగా సినిమాలతో బిజీగా మారారని అనవసరంగా ఈ అవార్డుల లొల్లిలోకి ఆయనను లాగవద్దని తమ్మారెడ్డి హితవు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa