ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నితిన్ 'భీష్మ' సరా సరి సాంగ్ ఫస్ట్ గ్లిమ్ప్స్!

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 08, 2020, 07:15 PM

ప్రస్తుతం వరుసగా నాలుగు చిత్రాలు చేస్తున్న నితిన్ భీష్మ మూవీ ఈనెల 21న విడుదల కానుంది. దర్శకుడు వెంకీ కుడుముల రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా భీష్మ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా నేడు ఈ మూవీ నుండి సరా సరి… అనే సాంగ్ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియోని విడుదల చేశారు. రేపు సాయంత్రం 4:05 నిమిషాలకు ఈ సాంగ్ పూర్తి లిరికల్ వీడియో విడుదల చేయనున్నారు. భీష్మ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. సరా సరి సాంగ్ కి శ్రీ మణి సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి పాడారు. ఇక పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ ఆహ్లాదకరంగా ఉంది. భీష్మ చిత్రంతో మొదటిసారి రష్మిక, నితిన్ సరసన నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa