ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు 'వరల్డ్ ఫేమస్ లవర్' ప్రీ రిలీజ్ ఈవెంట్!

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 09, 2020, 12:18 PM

దర్శకుడు క్రాంతి మాధవ్  విజయ్ దేవరకొండ హీరోగా ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా గా తెరకెక్కిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.  ఈ చిత్రం 14న ప్రేమికుల రోజు కానుకగా విడుదల కానుంది. ఈనేపథ్యంలో నేడు సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నార్సింగ్ నందు గల కన్వెన్షన్స్& ఎక్సిబిషన్స్ నందు ఈ ఈవెంట్ నేటి సాయంత్రం 6 గంటల నుండి జరగనుంది. దర్శక నిర్మాతలు మరియు నటీనటులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో కె వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసబెల్లా హీరోయిన్స్ గా నటిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa