ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో సమంత, శర్వానంద్ జంటగా తెరకెక్కించిన చిత్రం జాను. సినిమా టాక్ చుస్తే చాలా బాగుంది. కానీ ఇప్పుడు కలెక్షన్లు చూస్తుంటే మాత్రం అలా జరగడం లేదు. ఈ చిత్రం ఓపెనింగ్స్ కూడా నిరాశజనకంగానే ఉన్నాయి. ముఖ్యంగా మూడు రోజుల తర్వాత జాను పరిస్థితి డైలమాలో పడిపోయింది. దిల్ రాజు నమ్మిన మ్యాజిక్ ఇక్కడ రిపీట్ కావడం లేదు. ఇప్పటి వరకు కేవలం 7 కోట్లు మాత్రమే వసూలు చేసింది జాను. తొలిరోజు నుంచే మల్టీప్లెక్స్ ఆడియన్స్ మాత్రమే ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యారు. బి,సి సెంటర్స్‌లో వసూళ్ల వేటలో బాగానే వెనకబడిపోయింది జాను. వీకెండ్ కలెక్షన్స్ చూస్తుంటే జాను పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6.60 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా బిజినెస్ దాదాపుగా 19 కోట్ల వరకు జరిగింది. అయితే ఇప్పటి వరకు వస్తున్న వసూళ్ళు మాత్రం నిరాశనే కలిగిస్తున్నాయి. బయ్యర్లకు కూడా ఈ చిత్రం టెన్షన్ పెడుతుంది. బ్రేక్ ఈవెన్ కావాలంటే జాను మరో 12 కోట్లు వసూలు చేయాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా అంత దూరం వెళ్లడం మాత్రం అసాధ్యమే. పైగా ఈ వారం వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ విజయ్ దేవరకొండ వస్తున్నాడు. ఫుల్ రన్‌లో ఈ సినిమా 12 కోట్లు వసూలు చేస్తే గొప్పే అంటున్నారు ట్రేడ్ పండితులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa