ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య సినిమాలో నయనతార?

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2020, 12:25 PM

 బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే తాజగా సమాచారం ప్రకారం ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతారను ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నయనతార బాలయ్య సరసన ‘సింహ’, జయసింహ చిత్రాల్లో కలిసి నటించింది. ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 26 నుండి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే గుండుతో పాటు ఫుల్ మీసంతో ఉన్న ఫోటో బాగా వైరల్ అయ్యాయి. మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa