ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ మూవీ నుంచి ఆసక్తికరమైన విషయం ఏంటంటే?

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2020, 12:34 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ తో మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే కీలక సిన్నవేశాలను షూట్ చేసిన పవన్ కళ్యాణ్ పై ఒక పవర్ ఫుల్ ఫైట్‌ను చిత్రీకరించారట. సినిమా కూడా ఈ ఫైట్ మీదే ఓపెన్ అవుతుందట. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడనున్న తొలి సీన్ ఫైట్‌ కావడం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే విషయమే. అలాగే ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు స్క్రిప్ట్ లో చాలానే మార్పులు చేశారు.ఇక చిత్రబృందం ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. దాదాపు ఈ సినిమాకు ‘వకీల్ సాబ్’ టైటిలే ఫిక్స్ అయ్యేలా ఉంది. ఇదే టైటిల్ ను ఉగాది రోజున రివీల్ చేయనున్నారు. ఇక ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు డిసైడ్ అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa